Telugu Global
Sports

మూడో రోజు ముగిసిన ఆట..భార‌త్‌ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. బెంగళూరులో మూడోరోజు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది

మూడో రోజు ముగిసిన ఆట..భార‌త్‌ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు
X

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్‌లో కివీస్ జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌పై 356 పరుగుల ఆధిక్యత సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 134, కాన్వే 91, టిమ్ సౌథి 65, విల్ యంగ్ 33 పరుగులు చేసి రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌, జస్ప్రీత్ బూమ్రాలు తలో రెండేసి వికెట్లు పడగొట్టారు. బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా కష్టాల నుంచి గట్టెక్కే దిశగా పయనిస్తుంది. భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మెరుగ్గా ఆడుతూ న్యూజిలాండ్‌ ఆధిక్యాన్ని తగ్గిస్తుంది.

ఆట ముగిసే సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (35), రోహిత్‌ శర్మ (52) ఔట్‌ కాగా.. సర్ఫరాజ్‌ (70) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 129 పరుగులు వెనుకపడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్ అయిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్(70), విరాట్ కోహ్లీ(70)లు హాఫ్ సెంచ‌రీలతో విరుచుకుప‌డ్డారు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగి.. చెరో యాభై కొట్టేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కోహ్లీకి ఇది 31వ ఫిఫ్టీ. మెరుపు బ్యాటింగ్ చేసిన ఈ జోడీ మూడో వికెట్‌కు 96 ప‌రుగులు జోడించింది. భారత్ ఇంకా 125 పరుగులు వెనకంజలో ఉంది.

First Published:  18 Oct 2024 12:02 PM GMT
Next Story