Telugu Global
Sports

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఇదే

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఇదే
X

ఛాంపియన్స్ ట్రోఫీ ట్రోఫీ-2025లో పాల్గోనే భారత జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. 2 గ్రూపులుగా విభజించిన ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు ఆడనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో టీమ్ ఇండియా గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్ దశలో ఈ మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.ఫిబ్రవరి 20 నుంచి ఈ టోర్నీలో అరంగేట్రం చేయనున్న భారత్, తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఆ తర్వాత గ్రూప్‌లోని తన చివరి మ్యాచ్‌లో మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

భారత జట్టు

రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్ సుందర్

First Published:  18 Jan 2025 3:13 PM IST
Next Story