డ్రాగా ముగిసిన మూడో టెస్టు
గబ్బాలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
బ్రిస్బేన్ గబ్బాలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదోవ రోజు రెండవ ఇన్నింగ్‌లో ఆసీస్ 89/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్ లీడ్‌తో కలిపి టిమీండియా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. భారత్ రెండో ఇన్నింగ్స్ 8/0 ఉన్న దశలో మ్యాచ్‌కు వరుణుడు మరోసారి అంతరాయం కలిగించాడు. ఐదోరోజు చివరి సెషన్లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ డ్రాగా ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యాన్ని సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 89 రన్స్ చేసింది.
జస్ప్రీత్ బూమ్రా ఆస్ట్రేలియాలో 10 మ్యాచ్‌ల్లో (గబ్బా టెస్టుతో కలిపి) 53 వికెట్లు పడగొట్టాడు. 17.21 సగటుతో మెరుగైన ప్రదర్శన చేశాడు. కపిల్ దేవ్ 11 మ్యాచ్‌ల్లో 51 వికెట్లు, అనిల్ కుంబ్లే 10 మ్యాచ్ ల్లో 49, అశ్విన్ 11 మ్యాచ్‌ల్లో 40, బిషన్ సింగ్ బేడి 7మ్యాచ్ ల్లో 35 వికెట్లు పడగొట్టాడు. ఇక గబ్బా మ్యాచ్‌లో ఆసీస్ వికెట్లను కోల్పోతున్నప్పటికీ వేగంగా ఆడేందుకు యత్నించాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (22) దూకుడు ప్రదర్శించాడు. అతణ్ణి బూమ్రా పెవలియిన్కు చేర్చాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్ 252/9 తో ఐదు రోజు ఆటను ఆరంభించిన భారత్.. మరో 8 రన్స్‌ను జోడించి 260 పరుగులకు ఆలౌటైంది.