రెండో రోజు ముగిసిన ఆట..కివీస్ లీడ్ ఎంతంటే?
ముంబయి వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మూడవ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ మ్యాచ్ ముగిసే సమయానికి కివీస్ 171/9 పరుగులు చేసింది.
ముంబయి వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న మూడవ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ మ్యాచ్ ముగిసే సమయానికి కివీస్ 171/9 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓవరాల్‌గా 143 రన్స్ లీడ్‌లో ఉంది. రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాటర్లలో కుప్పకూలారు. విల్ యంగ్ (51) అర్థ సెంచరీతో రాణించారు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా 263 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది.
కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ తన స్పిన్‌తో భారత బ్యాటర్లను చుట్టేశాడు. అజాజ్ పటేల్ 5 వికెట్లు తీసుకున్నాడు. చివరలో ఇండియన్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ శుభమన్ గిల్ 90 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.