రెండో టెస్టులో శ్రీలంక భారీ ఆధిక్యం.. 88 పరుగులకే కివీస్ ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 602-5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ తడబడింది. ఈ మ్యాచ్‌లో పస్ట్ బ్యాటింగ్ చేసిన లంక మొదటి ఇన్నింగ్స్‌లో 602-5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఓవర్‌నైట్ స్కోరు 22/2తో మూడో రోజు ఆట ఆరంభించిన కివీస్.. ప్రభత్ జయసూర్య (6/42) ధాటికి 39.5 ఓవర్లలోనే 88 పరుగులకు కుప్పకూలింది.
దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లంకు 514 పరుగులు భారీ ఆధిక్యం దక్కింది.ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక ఆధిక్యాన్ని దక్కించుకున్న అయిదో జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది.ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ (29), డారిల్ మిచెల్ (13), రచిన్ రవీంద్ర (10)లు మాత్రమే రెండు అంకెల స్కోర్లు చేయగా మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఆరు వికెట్లు తీశాడు. నిషాన్ పీరిస్ మూడు వికెట్లు పడగొట్టగా అసిత ఫెర్నాండో ఓ వికెట్ సాధించాడు.