Telugu Global
Sports

రోడ్రిగ్స్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది.

రోడ్రిగ్స్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు
X

రాజ్ కోట్ వేదికగా ఐర్లాండ్ మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్. జట్టులో జేమీమా రోడ్రిగ్స్ (102) సెంచరీతో చేలరేగారు. అంతకు ముందు స్మృతి మంధాన (73) పరుగులు ప్రతికా రావల్ (67) హర్లీన్ డియోల్ (89) హాప్ సెంచరీలతో విజృంభించారు. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, కెల్లీ చెరో 2, డెంప్సె ఒక వికెట్ తీశారు.

First Published:  12 Jan 2025 3:14 PM IST
Next Story