Telugu Global
Sports

గ్రాండ్‌గా పీవీ సింధు నిశ్చితార్థం వేడుక

భారత స్టార్‌ షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్స్‌ పతక విజేత పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు.

గ్రాండ్‌గా  పీవీ సింధు నిశ్చితార్థం వేడుక
X

హైదరాబాద్ స్టార్ షట్లర్, డబుల్ ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇవాళ పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్ మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నది."ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు" అని లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్‌ కోట్‌ను క్యాప్షన్‌గా సింధు జోడించింది. ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా ఇద్దరూ కేక్‌ కట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. కాగా డిసెంబర్ 22న ఉదయ్‌పూర్‌ వేదికగా సింధు-సాయి వివాహం జరగనున్నది. సింధు వివాహ వేడుకలు ఈ నెల 20 నుంచే ప్రారంభం కానున్నాయి.

ఇప్పటికే ఇరు కుటంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ కాబోయే జంట ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వంటి ప్రముఖలను తమ పెళ్లికి ఆహ్వానించారు. ఇక సింధుకు కాబోయే వరుడు విషయానికి వస్తే.. వెంకట దత్త సాయి హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్‌. పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌లో అతను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కాగా సింధు, వెంకట సాయి ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇప్పుడు ఈ పెళ్లితో అది మరింత పటిష్ఠం కానుంది. జనవరి నుంచి సింధు వరుస టోర్నీలు ఆడనున్నది. అందుకే సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని సింధు తండ్రి రమణ నిశ్చయించుకున్నామని ఆయన తెలిపారు.

First Published:  14 Dec 2024 7:27 PM IST
Next Story