Telugu Global
Sports

నితీశ్ రెడ్డి, రింకూ హాఫ్ సెంచరీలు.. బంగ్లాదేశ్‌‌కు భారీ టార్గెట్

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది.

నితీశ్ రెడ్డి, రింకూ హాఫ్ సెంచరీలు.. బంగ్లాదేశ్‌‌కు భారీ టార్గెట్
X

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు సంజు, అభిషేక్ 25 పరుగులకే అవుట్ అయ్యారు. తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయినా కష్టాల్లో ఉన్న టీమ్ ఇండియాను తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్నాడు. ఏకంగా 7 సిక్సర్లు, 4 ఫోర్లతో కేవలం 34 బంతుల్లో 74 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 53 అర్థ సెంచరీతో మెరించాడు.ఈ జోడీ సుడిగాలిలా చెల‌రేగ‌గా టీమిండియా 221 ర‌న్స్ చేసింది.

ఆ త‌ర్వాత వ‌చ్చిన హార్దిక్ పాండ్యా(32) నేనేమ‌న్నా త‌క్కువా అంటూ విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఇంకేముంది రికార్డులు మ‌రోసారి బ‌ద్ధ‌లయ్యాయి. పొట్టి క్రికెట్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా అత్య‌ధిక స్కోర్ కొట్టేసింది. బంగ్లా బౌలర్లలో హుస్సేన్ 3 వికెట్లు, తస్కిన్ అహ్మద్, హసన్ సాకీబ్, ముస్తఫిజూర్ రెహమాన్ తలో రెండు వికెట్లు తీశారు.

First Published:  9 Oct 2024 8:56 PM IST
Next Story