మోమినుల్ హక్ శతకం.. 233 పరుగులకే బంగ్లా ఆలౌట్
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (107*) రన్స్ చేశాడు.
BY Vamshi Kotas30 Sept 2024 1:36 PM IST

X
Vamshi Kotas Updated On: 30 Sept 2024 1:36 PM IST
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్‌లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌటైంది. మొమినుల్ హక్ (107*) రన్స్ చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు.. అశ్విన్, ఆకాశ్ దీప్, సిరాజ్ చెరో 2, జడేజా ఒక వికెట్ తీశారు. ఓవర్‌నైట్ 107/3 స్కోరుతో బంగ్లా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే మ్యాచ్ జరిగింది.. గత రెండు రోజులూ ఒక్క బాల్ కూడా పడకుండానే వర్షం వల్ల మ్యాచ్ క్యాన్సిల్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ శాంటో (31), షద్మాన్ ఇస్లామ్ (24), మెహిదీ హసన్ మిరాజ్ (20), లిటన్ దాస్ (13), ముష్ఫికర్ రహీమ్ (11), షకిబ్ (9) రాణించలేదు.
Next Story