Telugu Global
Sports

సెంచరీలతో విజృంభించిన కివీస్ బ్యాటర్లు..పాక్ లక్ష్యం ఎంతంటే?

పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు

సెంచరీలతో విజృంభించిన కివీస్ బ్యాటర్లు..పాక్ లక్ష్యం ఎంతంటే?
X

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కరాచీ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట‌ర్లు విజృంభించారు. టాస్ ఓడి పస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 316 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో విల్ యంగ్‌, టామ్ లాథ‌మ్ అద్భుత‌మైన సెంచ‌రీల‌తో చెలరేగారు. 73 ప‌రుగుల‌కే మూడు కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కివీస్‌ను లాథమ్‌, యంగ్ త‌మ అద్బుత ఇన్నింగ్స్‌ల‌తో అదుకున్నారు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 114 ప‌రుగుల విలువైన భాగ‌స్వామ్యం నెలకొల్పారు. విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేయగా.. లాథమ్‌ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఆఖరిలో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్‌, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్‌​ పడగొట్టారు.

First Published:  19 Feb 2025 7:06 PM IST
Next Story