Telugu Global
Sports

తొలి వన్డేలో భారత్‌ విజయం..అర్ధశతకాలతో రాణించిన గిల్, అయ్యర్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి నేడు వన్డేలో భారత్ విజయం సాధించింది

తొలి వన్డేలో భారత్‌ విజయం..అర్ధశతకాలతో రాణించిన గిల్, అయ్యర్
X

నాగపూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మొదటి నేడు వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్‌ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలోటీమ్ ఇండియా ఛేదించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు జైస్వాల్‌ (15) రోహిత్‌ శర్మ (2) ఓటైనా శుభ్‌మన్‌ గిల్‌ (87), శ్రేయస్‌ అయ్యర్‌ (59), అక్షర్‌ పటేల్‌ (52) అర్ధశతకాలు రాణించారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో మహమూద్‌, రషీద్‌కు చెరో 2 వికెట్లు, ఆర్చర్‌, బెతెల్‌కు తలో వికెట్‌ తీశారు. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ బ్యాటర్లు జాస్‌ బట్లర్‌ (52), జాకబ్‌ (51) అర్ధసెంచరీతో రాణించగా.. ఫిలిప్‌ సాల్ట్‌ 43 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా 3, రవీంద్ర జడేజా 3, షమి 1, అక్షర్‌ పటేల్‌ 1, కుల్‌దీప్‌ 1 వికెట్ తీశారు.

First Published:  6 Feb 2025 8:48 PM IST
Next Story