Telugu Global
Sports

ఐర్లాండ్‌‌పై భారత్ విజయం

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఐర్లాండ్‌‌పై భారత్ విజయం
X

రాజ్‌ కోట్ వేదికగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తడబడిన ఐర్లాండ్..కెప్టెన్ గాబీ లెవిస్(92), లెహ్ పాల్(59) రాణించడంతో పోరాడే స్కోరు సాధించింది. అయితే, 239 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది.

ఐర్లాండ్ బౌలర్లను ప్రాతిక రావల్(89), తేజాల్ హసబ్నిస్(53 నాటౌట్), స్మృతి మంధాన(41) ఉతికారేశారు. ఓపెనర్లు మంధాన, ప్రాతిక తొలి వికెట్‌కు 70 పరుగుల జోడించి అదిరిపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత ప్రాతిక, తేజాల్ మిగతా పని పూర్తి చేశారు. దీంతో భారత్ 34.3 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రాజ్‌కోట్ వేదికగానే రెండో వన్డే జరగనుంది.

First Published:  10 Jan 2025 6:21 PM IST
Next Story