వర్షం అడ్డంకి తొలి రోజు ముగిసిన మ్యాచ్ బంగ్లా స్కోరు 107/3
కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
భారత్-బంగ్లదేశ్ మధ్య రెండో టెస్టు మొదటి రోజు వర్షం కారణంగా మ్యాచ్ అర్దాంతరంగా ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయాని బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్‌లో ఉన్నారు. టిమీండియా బౌలర్లలో అర్షదీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లొ భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
మ్యాచ్ మొదటి నుంచి లైటింగ్ లేకపోవడంతో మ్యాచ్‌కు పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో గ్వాలియర్, ఢిల్లీ, హైదారాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.