ఎస్ఆర్‌హెచ్‌కి సెలక్ట్ అవ్వడం సంతోషంగా ఉంది : హర్షల్ పటేల్
ఐపీఎల్ వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు సెలక్ట్ కావటం చాలా రిలీఫ్‌గా ఉందని హర్ష పటేల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఎంపికవడంపై హర్ష పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు సెలక్ట్ కావటం చాలా రిలీఫ్‌గా ఉందన్నారు. ఆ జట్టు తరుపున బౌలింగ్ చేయడం ఈజీ అని వారికి అపోజిట్‌గా బౌలింగ్ వేయడం కష్టమని హర్ష పటేల్ అన్నారు. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు బ్యాటర్లు విధ్వంసం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇక ఆ టీమ్ కి ఆడటం ఉపశమనాన్ని ఇస్తుందని హర్షల్ పటేల్ తెలిపారు. పంజాబ్ కింగ్స్ కి ఆడిన హర్షల్ తాజాగా వేలంలో రూ.8కోట్లతో ఎస్‌ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది మాత్రం సన్ రైజర్స్ కీలక బౌలర్ భువనేశ్వర్ ని వదులుకుంది.
భువనేశ్వర్ స్థానంలో మహ్మద్ షమీ, హర్షల్ పటేల్ ను తీసుకున్నారు.తాజాగా హర్షల్ పటేల్ ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ కి ఎంపికవ్వడం పై హర్షం వ్యక్తం చేశారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. హెన్రిచ్ క్లాసేన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకున్న ఫ్రాంచైజీ.. వేలంలో మరో 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రూ. 45 కోట్ల తక్కువ మొత్తంతో వేలంలో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఆటగాళ్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.