దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌లో కివీస్ జట్టు ఘన విజయం సాధించింది.
![దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం](https://www.teluguglobal.com/h-upload/2025/02/10/1402197-bfbs.webp)
పాక్‌లో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. పస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్‌ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 304 పరుగులు చేసింది. సపారీ బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్‌కే విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.148 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. తద్వారా అరంగేట్రంలో 150 రన్స్ చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
అతడితో పాటు వియాన్ ముల్డర్ (64), జాసన్ స్మిత్ (41) కూడా రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నాలుగు వికెట్లను కోల్పోయి 305 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్ టీ20 తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. కేన్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచే తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తన 14వ వన్డే సెంచరీని కేన్ మామ అందుకున్నాడు.