నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్
భారత్- ఇంగ్లాండ్ జట్లు మధ్య నాలుగో టీ20లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్- ఇంగ్లాండ్ జట్లు మధ్య నాలుగో టీ20లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. పుణేలో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడు మార్పులతో టిమీండియా బరిలోకి దిగింది. మహ్మద్ షమీ స్థానంలో అర్ష్దీప్, జురెల్ స్థానంలో రింకూసింగ్, సుందర్ స్థానంలో శివమ్ దూబే ఆడనున్నారు. టీమిండియా వరుసగా రెండు టీ20 మ్యాచుల్లో ఇంగ్లాండ్ పై విజయం సాధించి మూడో టీ20లో అపజయంపాలైంది. దీంతో భారత్ 2-1 అధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం అవుతుంది. లేకపోతే సిరీస్ ఆఖరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. నాలుగో టీ20 మ్యాచ్ లో భాగంగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సిరీస్ కోసం భారత్, సిరీస్ నిలబెట్టుకునేందుకు ఇంగ్లాండ్ బరిలోకి దిగబోతున్నాయి.
భారత్ జట్టు
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లండ్ జట్టు
ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్, బెతెల్, బ్రైడన్ కార్స్, జేమీ ఒవర్టన్, అడిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మహమూద్