మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం
స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
స్టార్ షూటర్, ఒలింపిక్ మెడలిస్ట్ మాను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఓ కారు ఢీకొట్టిందని పొలీసులు తెలిపారు. ఇక ఘటనలో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. కారు అతి వేగంగానే రావడంతోనే… ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… రెండు రోజుల కిందటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డు అందుకుంది స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్. ఇక ఇంతలోనే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మను భాకర్ మామయ్య యుధ్వీర్ సింగ్ ప్రా, అమ్మమ్మ సావిత్రిదేవి ప్రాణాలు కోల్పోయారు. యుధ్వీర్ (50) రోడ్‌వేస్ డ్రైవర్ కాగా.. సావిత్రి దేవి (70) కూడా క్రీడాకారిణి. ఆమె కూడా జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. యుధ్వీర్ ఇల్లు మహేంద్రగఢ్ బైపాస్‌లో ఉంది. స్కూటీపై డ్యూటీకి వెళ్తున్నాడు. అదే సమయంలో ఆయన వెంట సావిత్రిదేవిని తీసుకెవెళ్తున్నారు. తమ్ముడి ఇంటి వద్ద దింపేందుకు వెళ్తున్న సమయంలో కలియానా మలుపు వద్దకు చేరుకోగానే.. అదుపు తప్పుతూ వచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది.