హిందీ భాషపై క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్
‘హిందీ అధికారిక భాష మాత్రమే. జాతీయ భాష కాదని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు
BY Vamshi Kotas10 Jan 2025 4:09 PM IST
X
Vamshi Kotas Updated On: 10 Jan 2025 4:09 PM IST
టీమిండియా మాజీ సిన్నర్ రవించద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేటు కళాశాల స్నాతకోత్సవానికి అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషల గురించి విద్యార్థులను ప్రశ్నించారు.
అయితే, హిందీ భాష గురించి ఒకరిద్దరి నుంచి మాత్రమే సమాధానం వచ్చింది. హిందీ అర్థమవుతుందని కొంతమంది నుంచే సమాధానం వచ్చింది. దీంతో అశ్విన్ మాట్లాడుతూ... హిందీ అధికారిక భాష మాత్రమేనని, జాతీయ భాష కాదని చెప్పారు. అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story