ఛాంపియన్స్ ట్రోఫీ.. దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన గ్రూప్ బి మ్యాచ్ రద్దయింది.
BY Vamshi Kotas25 Feb 2025 6:40 PM IST

X
Vamshi Kotas Updated On: 25 Feb 2025 6:40 PM IST
ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ గ్రూప్- బిలో దక్షిణాఫ్రికా - ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన గ్రూప్ బి మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టాస్ పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత వర్షం తగ్గుముఖం పట్టేలా కనిపించడంతో 20 ఓవర్ల చొప్పున ఆడించే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. కానీ ఆఖరికి మ్యాచ్‌ను రద్దు చేశారు.
గ్రూప్ బి పాయింట్ల పట్టిక చూస్తే.. చెరో మూడు పాయింట్లతో సౌత్ ఆఫ్రికా, ఆసీస్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ బాగుండటంతో సఫారీలు తొలి స్థానంలో ఉన్నారు. ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ పాయింట్ల ఖాతా తెరవాల్సి ఉంది. మరోవైపు ఈ రద్దు కారణంగా ఈ గ్రూపులో ఉన్న నాలుగు జట్లకు ఇంకా సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉన్నాయి.
Next Story