ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్, బంగ్లా మ్యాచ్ రద్దు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ని ఆతిథ్యిమించి పాక్ ఒక్క గెలుపు లేకుండా టోర్ని ముగించింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. నిన్నమార్నింగ్ నుంచి రావల్పిండిలో నుంచి వర్షం కురిసింది. దీంతో మైదానమంతా చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ మొత్తం జలమయం అవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేసిన అంపైర్లు.. ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు. పాకిస్థాన్‌తోపాటు బంగ్లాదేశ్ ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది.
అయితే ఈ టోర్నీ గ్రూప్ ఏ లో ఉన్న ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే సెమీస్ రేస్ నుండి ఎలిమినేట్ అయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవాలి ఈ రెండు జట్లు విజయంతో టోర్నీని ముగించాలి అనుకున్నాయి.ముఖ్యంగా 27 ఏళ్ళ తర్వాత తమ దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహిస్తున్న పాకిస్థాన్.. సెమీస్ కు చేరకుండా అభిమానులను నిరాశపరిచింది.మరోవైపు.. గ్రూప్ ఎ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఆదివారం టీమ్ఇండియా, కివీస్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలుస్తుంది.