Telugu Global
Sports

అరుదైన రికార్డు సృష్టించిన బుమ్రా..400 వికెట్ల క్లబ్‌లోకి

చెపాక్ వేదికగా భారత్- బంగ్లా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నారు.

అరుదైన రికార్డు సృష్టించిన బుమ్రా..400 వికెట్ల క్లబ్‌లోకి
X

చెపాక్ వేదికగా భారత్- బంగ్లా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన మైలు రాయిని చేరుకున్నారు. అన్ని అంతర్జాతీయ ఫార్మాట్‌లో కలిపి 400 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన పదో భారత్ బౌలర్‌గా బుమ్రా రికార్డు సృష్టించారు. బుమ్రా అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో 36.5వ ఓవర్ వద్ద హసన్ అహ్మద్ వికెట్​తో బుమ్రా ఈ ఫీట్ అందుకున్నాడు. కాగా ,టెస్టు (163), వన్డే (149), టీ20 (89) ఉన్నాయి. ఈ ఫీట్ సాధించిన 6వ టీమ్ఇండియా పేసర్​ కాగా, ఓవరాల్​గా 10వ భారత బౌలర్​గా రికార్డు సాధించాడు.

చెన్నై వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 149 పరుగుల స్వల్ప స్కోరుకే బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో చెలరేగాడు. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. పటిష్టంగా ఉన్న భారత బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. 32 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 27 పరుగులతో మెహదీ హసన్ మిరాజ్ నాటౌట్‌గా నిలిచాడు.

First Published:  20 Sept 2024 4:39 PM IST
Next Story