Telugu Global
Sports

భార‌త మాజీ క్రికెట‌ర్‌పై అరెస్ట్ వారెంట్‌ ఎందుకంటే ?

మాజీ క్రికెటర్ రాబిన్‌ ఉతప్ప పీఎఫ్‌ చెల్లింపుల వివాదంలో చిక్కుకున్నాడు.

భార‌త మాజీ క్రికెట‌ర్‌పై అరెస్ట్ వారెంట్‌ ఎందుకంటే ?
X

భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తను నిర్వహిస్తున్న కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని ఉతప్పపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఇష్యూకి సంబంధించి ఇటీవల అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉద్యోగులకు దాదాపు రూ.24 లక్షల పీఎఫ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించడానికి రాబిన్ ఉతప్పకి ఈనెల‌ 27 వరకు సమయం ఉంది. లేదంటే అరెస్టును ఎదుర్కోవలసి ఉంటుంది. రాబిన్ ఉతప్ప బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ సుమారు రూ. 23,36,602 పీఎఫ్ నిధుల‌ను ఉద్యోగుల జీతాల నుంచి క‌ట్ చేసిన‌ప్ప‌టికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జ‌మ చేయ‌లేదు.

మాజీ టీమిండియా ప్లేయర్ ఇలా ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో నిధుల‌ను జ‌మ చేయ‌కుండా మోసం చేసిన‌ట్లు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా దాదాపు రూ.23 లక్షలను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని తేలడంతో పీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ అతడికి నోటీసులు జారీ చేశారు. వాటిని అందజేసేందుకు డిసెంబరు 4న పులకేశినగర్‌లోని మాజీ క్రికెటర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ అతడు లేకపోవడంతో దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ స్థానిక పోలీసులను ఆదేశించినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వచ్చాయి. ప్రస్తుతం ఉతప్ప కుటుంబం దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

First Published:  21 Dec 2024 2:31 PM IST
Next Story