Telugu Global
Sports

ట్రావిస్ హెడ్ మరో శతకం.. ఆసీస్ స్కోరు 234/3

గబ్బా టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ దూకుడుగా సాగుతోంది. రెండో రోజు టీ బ్రేక్ సమయానికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.

ట్రావిస్ హెడ్ మరో శతకం.. ఆసీస్ స్కోరు 234/3
X

భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ అజేయ శతకం సాధించాడు. రెండో రోజు మొత్తం 119 బంతులు ఆడిన హెడ్ 13 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. కాగా ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మొదటి రోజు 13.2 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మొదటి రోజు మ్యాచును రద్దు చేశారు. అనంతరం ఆదివారం రెండో రోజు మ్యాచ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఆస్ట్రేలియా రెండు వికెట్లను కోల్పోయింది.

అలాగే మరోపక్క స్టీవ్ స్మిత్ కూడా నిలకడగా రాణిస్తూ.. సెంచరీ దిశగా ముందుకు సాగుతున్నాడు. మొత్తం 150 బంతులను ఆడిన స్మిత్ 43 స్ట్రైక్ రేటుతో 65 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 71 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత హెడ్ దాదాపు ప్రతి ఓవర్లోనూ భారత బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌలర్లను దీటుగా ఎందుర్కొంటూ.. లూస్ బంతులను బౌండరీలకు తరలిస్తూ.. తమ జట్టును భారీ స్కోర్ వైపు పరుగులు పెట్టించారు.

First Published:  15 Dec 2024 11:30 AM IST
Next Story