Telugu Global
Science and Technology

OnePlus 12 | వన్‌ప్లస్ నుంచి 23న మరో ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!

OnePlus 12 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.

OnePlus 12 | వన్‌ప్లస్ నుంచి 23న మరో ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
X

OnePlus 12 | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను ఈ నెల 23న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇంతకుముందే చైనా మార్కెట్లో ఎంటరైన వన్‌ప్లస్ 12 ఫోన్ 100వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, క్వాల్‌కామ్‌ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తోంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టాస్క్‌ల‌ను హ్యాండ్లింగ్ చేయ‌డంలో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 8 జెన్ చిప్ సెక్యూరిటీగా ఉంటుంది.

వన్‌ప్లస్ 12 సిరీస్‌లో వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12 ఆర్ ఫోన్లు వస్తున్నాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ ధర రూ.66,400 నుంచి రూ.69,999 ఉండొచ్చునని భావిస్తున్నారు. ‘స్మూత్ బియాండ్ బిలీఫ్’ ఈవెంట్‌లో భాగంగా ఈ నెల 23న భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరిస్తారు. గతేడాది డిసెంబర్‌లో చైనా మార్కెట్లో వన్‌ప్లస్ 12 ఫోన్ రిలీజైంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర సుమారు రూ.50,700 (4,299 చైనా యువాన్లు) పలికింది. పేల్ గ్రీన్, రాక్ బ్లాక్, వైట్ కలర్స్‌లో లభించింది. ఔట్‌డోర్‌లో బ్రైట్ స‌న్‌లైట్‌లో వాడ‌టానికి వీలుగా 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ క‌లిగి ఉంటుంది. డోల్బీ విజ‌న్ మ‌ద్ద‌తుతో 10-బిట్ క‌ల‌ర్ డెప్త్‌తో వ‌స్తోంది.

చైనా మార్కెట్లో విడుదల చేసిన వన్‌ప్లస్ 12 ఫోన్‌నే భారత్‌లోనూ విడుదల చేస్తారని భావిస్తున్నారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్స్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.82 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ (1440x3168 పిక్సెల్స్) ఎల్‌టీపీఓ స్క్రీన్ కలిగి ఉంటుంది. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తున్న ఈ ఫోన్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 12 ఫోన్ 50-మెగా పిక్సెల్స్ సోనీ ఎల్‌వైటీ - 808 విత్ ఓఐఎస్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 64 మెగా పిక్సెల్ పెరిస్కోప్ కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టిక‌ల్ జూమ్‌, 48 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది. 100 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ / 50 వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ / 10 వాట్ల రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ మద్దతుతో 5400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. కేవ‌లం 26 నిమిషాల్లో 100 శాతం బ్యాట‌రీ రీచార్జీ అవుతుంది.

First Published:  13 Jan 2024 7:15 AM GMT
Next Story