Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    పుల్లని త్రేనుపులను వదిలించుకోవాలంటే..

    By Telugu GlobalJanuary 13, 2024Updated:March 29, 20252 Mins Read
    పుల్లని త్రేనుపులను వదిలించుకోవాలంటే..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    జీవనశైలిలో వస్తున్నా మార్పులు, వాటిపై మనం చేస్తున్న అజాగ్రత్త కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అతిగా తినడం, అధిక నూనే వినియోగం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని ప్రధాన సమస్యలుగా మారి ఆసుపత్రి పాలయ్యేలా చేస్తే, మరికొన్ని చెప్పటానికి వీలుకాని చిన్న సమస్యగానే ఉంది తరువాత మరో ఆరోగ్య సమస్యకు పునాదిగా మారుతాయి.

    సమయానికి ఆహారం తీసుకోకపోవడం వాళ్ళ త్రేన్పులు (Burping) రావటం అనేది సాధారణ విషయం. ఎగువ జీర్ణవ్యవస్థ నుండి అదనపు గాలిని బయటకు పంపడానికి శరీరంలో జరిగే ఓ మార్పు ఇది. అధిక గాలిని మింగడం వల్ల చాలా త్రేన్పులు ఏర్పడతాయి. కానీ, ఇది పుల్లని త్రేన్పులుగా మారినప్పుడు మాత్రం ఆరోగ్య సమస్యకు సంకేతం.

    పుల్లని త్రేనుపు వెనుక అనేక కారణాలు ఉండవచ్చు, ఆహారం జీర్ణం కాకపోవడం, అన్నవాహికలో పేరుకుపోవడం తో పాటూ చాలా వేగంగా తినడం, త్రాగడం, తినేటప్పుడు మాట్లాడటం, గమ్ నమలడం, కార్బోనేటేడ్ పానీయాలు, పొగ త్రాగడం, ఇవన్నీ జీర్ణక్రియను,పొట్ట యొక్క జీవక్రియ స్థితిని పాడు చేస్తాయి. మలబద్దకంతో పాటూ పుల్లని త్రేనుపుకు కారణం కావచ్చు. అలాగే కడుపు లో ఉండే ఆమ్లం పదేపదే అన్నవాహికలోకి తిరిగి ప్రవహించడాన్ని గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ అంటారు. ఈ యాసిడ్ రిఫ్లక్స్ అన్నవాహిక లైనింగ్‌ను చికాకుపెడుతుంది. పుల్లని త్రేన్పుల రూపంలో బయటకు వస్తుంది.

     

    నివారించే మార్గాలు

    నిదానంగా బాగా నమిలి తినటం, కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేసే కార్బోనేటేడ్ పానీయాలు, బీర్‌లకు దూరంగా ఉండండం మంచిది. అలాగే ధూమపానం పొగను పీల్చినప్పుడు, గాలిని పీల్చుకుని మింగుతారు. దీనివల్ల పుల్లని త్రేనుపు వచ్చే అవకాశం ఉంది.

    ఉదయం నిద్రలేచిన వెంటనే వచ్చే పుల్లని త్రేనుపుకు నిమ్మరసంతో చెక్ పెట్టవచ్చు. పెరుగు కూడా పొట్టకు చల్లదనాన్ని ఇచ్చి సమస్య నుండి తక్షణ ఉపశమనం ఇస్తుంది. అలాగే సోపు, జీలకర్ర తినటం ద్వారా కూడా పుల్లని తేనుపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంగువ జీర్ణక్రియకు ఉత్తమమైనది. గ్యాస్ లేదా పుల్లని తేనుపు సమస్య ఉంటే, నీళ్లలో ఇంగువను కలుపుకుని తాగితే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

    Burping Sour Belching
    Previous ArticleOnePlus 12 | వన్‌ప్లస్ నుంచి 23న మరో ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
    Next Article తెలుగు రాష్ట్ర్రాలు వేదికగా ఇంగ్లండ్ తో రెండు టెస్టుమ్యాచ్ లు!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.