Telugu Global
Science and Technology

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్! ఈ మొబైల్స్‌పై మంచి ఆఫర్లు!

గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మే 3 నుంచి 7 వరకూ లైవ్‌లో ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లేటెస్ట్ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్! ఈ మొబైల్స్‌పై మంచి ఆఫర్లు!
X

గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో అమెజాన్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ మే 3 నుంచి 7 వరకూ లైవ్‌లో ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లేటెస్ట్ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే..

గ్రేట్ సమ్మర్ సేల్‌ను ఈ ఏడాదిలోనే అతిపెద్ద సేల్ ఈవెంట్‌గా అమెజాన్ ప్రమోట్ చేస్తుంది. కొత్త మొబైల్ కొనాలనుకునే వాళ్లు ఇందులో ఉండే డీల్స్‌పై ఓ లుక్కేయొచ్చు. సేల్‌లో మంచి డిస్కౌంట్స్ ఉన్న మొబైల్స్ లిస్ట్ ఓసారి చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ ఎం15

పదివేల రూపాయల బడ్జెట్‌లో మొబైల్ కొనాలనుకునేవాళ్లు శాంసంగ్ గెలాక్సీ ఎం15 మొబైల్‌పై ఓ లుక్కేయొచ్చు. రూ. 15,999గా ఉన్న ఈ మొబైల్ ధర సేల్‌లో రూ. 11,999కు అందుబాటులో ఉంది. కూపన్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా, ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది.

ఐక్యూ జెడ్9

ఇరవై వేల రూపాయల బడ్జెట్‌లో ఐక్యూ జెడ్9 మొబైల్‌ను బెస్ట్ డీల్‌గా చెప్పుకోవచ్చు. రూ. 26,999 అసలు ధర ఉన్న ఈ మొబైల్.. సేల్‌లో రూ. 20,999కు అందుబాటులో ఉంది. ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగిన ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది.

ఐకూ నియో 9 ప్రో..

ఒరిజినల్ ప్రైస్ రూ. 41,999గా ఉన్న ఐకూ నియో ప్రో మొబైల్ సమ్మర్ సేల్‌లో రూ. 35,999కి అందుబాటులో ఉంది. ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ , 144హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ డిస్‌ప్లే, 50ఎంపీ కెమెరా, 5160ఎంఎహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది.

ఐఫోన్ 13

ఐఫోన్ 13.. 128 జీబీ వేరియంట్ అసలు ధర రూ. 59,999కాగా అమెజాన్ సమ్మర్ సేల్‌లో రూ. 48,499 కి అందుబాటులో ఉంది. ఇందులో రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, ఏ15 బయోనిక్ చిప్, 12 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

First Published:  2 May 2024 3:36 PM IST
Next Story