Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఇలా..

    By Telugu GlobalMay 2, 2024Updated:March 29, 20252 Mins Read
    వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఇలా..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మే నెల వచ్చేసింది. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైన పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండే ఈ ఎండలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా మే నెలలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

    సమ్మర్ సీజన్‌లో భయపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది వడదెబ్బ మాత్రమే. ముఖ్యంగా బయటకు వెళ్లేవాళ్లు సన్ స్ట్రోక్ బారిన పడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగని ఇంట్లో ఉంటే సేఫ్ అని కాదు. ఉక్కపోతగా ఉన్న ప్రతిచోటా అప్రమత్తంగా ఉండడం అవసరం.

    వడదెబ్బ లేదా సన్ స్ట్రోక్ అనేది ప్రాణాపాయ పరిస్థితిని క్రియేట్ చేయగలదు. కాబట్టి పీక్ సమ్మర్ టైంలో వడదెబ్బ పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం. ముందుగా వీలైనంతవరకూ డైరెక్ట్ సన్‌లైట్‌కు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. వాటర్ బాటిల్‌తో పాటు వెంట నిమ్మరసం, ఓఆర్‌‌ఎస్ వంటివి కూడా క్యారీ చేయాలి.

    బయటి వాతావరణం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెదర్ అప్‌డేట్స్‌ను ఫాలో అవుతుండాలి. టెంపరేచర్లు పెరిగే రోజుల్లో, వడగాలులు వీచే రోజుల్లో బయటి ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఇంట్లో కూడా ఉక్కపోత లేకుండా కూలర్ల వంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిది. తెల్లటి వస్త్రాలు ధరించడం వదులైన బట్టలు వేసుకోవడం కూడా కొంత హెల్ప్ చేస్తుంది.

    అన్నింటికంటే ముఖ్యంగా సమ్మర్ సీజన్‌లో రోజుకి నాలుగైదు లీటర్ల నీటితోపాటు రోజూ నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగడం, పుచ్చకాయ, తర్భూజా వంటి పండ్లు తినడం మరింత మేలు చేస్తుంది.

    వడదెబ్బ తగిలినప్పుడు నీరసంగా అనిపిస్తుంది. మెదడులో గందరగోళం, చిరాకు వంటివి పెరుగుతాయి. తలనొప్పి, మైకం వంటివి కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో మూర్ఛ వచ్చి పడిపోవచ్చు. అలాగే మరికొంతమందికి వికారం, వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

    బయట లేదా ఇంట్లో ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు గుర్తిస్తే.. వెంటనే ఆ వ్యక్తిని నీడలోకి తీసుకెళ్లాలి. చల్లని నీటిలో ముంచిన గుడ్డతో ఒంటిని తుడవాలి. చల్ల గాలి తగిలేలా చూడాలి. నీటిని తాగించడానికి బదులు ఉప్పు కలిపి మజ్జిగ లేదా ఓఆర్‌‌ఎస్ ద్రావణం పట్టిస్తే మరింత రిలీఫ్ ఉంటుంది. ఆ తర్వాత లేట్ చేయకుండా కారు లేదా ఆటోలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.

    heat stroke Sun Stroke
    Previous Articleఅమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్! ఈ మొబైల్స్‌పై మంచి ఆఫర్లు!
    Next Article కేదార్‌నాథ్ ఆలయ మ్యూజియం నిర్మాణ నిపుణుడిగా శివనాగిరెడ్డి
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.