Telugu Global
National

కాంగ్రెస్ ఎంపీ భార్యకు పాక్ సంబంధాలపై దర్యాప్తు..ఏఐసీసీ ఫైర్

ఎంపీ గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్‌కి పాక్ సంబంధాలపై కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామని ఎంపీ తెలిపాడు

కాంగ్రెస్ ఎంపీ భార్యకు పాక్ సంబంధాలపై  దర్యాప్తు..ఏఐసీసీ ఫైర్
X

తన భార్య ఎలిజబెత్‌కు పాక్ సంబంధాలపై అస్సాం ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించడంపై ఏఐసీసీ లీగల్ టీమ్‌తో చర్చించమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే హిమంత ఇలా చేస్తున్నారు. ఆయనకు భయం కనిపిస్తోంది. ప్రజలు నిన్న ఆయన ముఖాన్ని గమనించారు ఆయన కళ్లను చూస్తే ఏదో కరెక్టుగా లేదని అర్థమవుతోందన్నారు. రోజుకో రకంగా మాట్లాడుతున్నారు అని అన్నారు.గౌరవ్ గొగోయ్ అనే పార్లమెంట్ సభ్యుడు( ఈయన డిప్యూటీ గా కూడా ఉన్నారు) రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.

ఆయన ఎలిజబెత్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె బ్రిటన్ పౌరురాలు. పాకిస్తాన్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు బీజేపీ ఆరోపిస్తున్నాది. గతంలో లీడ్ అనే పాకిస్తాన్ సంస్థకు ఆమె పని చేశారు. ఐఎస్ఐ తో ఆమెకు అనుబంధం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గౌరవ్ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఈ వ్యవహారంపై అసాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు.. గౌరవ్, ఎలిజబెత్ దేశద్రోహానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని హిమంత అస్సాం పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.

First Published:  17 Feb 2025 4:21 PM IST
Next Story