Telugu Global
National

సిద్ధరామయ్యపై కేసు నమోదు..ఆయన ఏమన్నారంటే

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది.

సిద్ధరామయ్యపై కేసు నమోదు..ఆయన ఏమన్నారంటే
X

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఇవాళ కేసు నమోదయింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల కుంభకోణంలో లోకాయుక్త కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో, లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్‌లో సిద్ధరామయ్యను ఏ1గా పేర్కొన్నారు. నిందితుల జాబితాలో సిద్ధూతో పాటు ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున్ తదితరులను కూడా చేర్చారు. ముడా స్థలాల కేటాయింపులో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని, ఇందుకోసం ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త ఇబ్రహీం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో దర్యాఫ్తులో భాగంగా సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చాంద్ గెహ్లాట్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ అనుమతి ఇవ్వడంపై సిద్దు హైకోర్టుకు వెళ్లారు.

కోర్టులో కూడా ఆయనకు చుక్కెదురైంది. లోకాయుక్త కేసు నమోదు చేయడంపై కర్ణాటక సిద్ధరామయ్య స్పందించారు. పస్ట్ టైం తనపై రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ‘నేనేం తప్పు చేయలేదు. నాపై రాజకీయ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది రాజకీయ కేసు, దయచేసి అండర్‌లైన్ చేయండి’ అని మీడియాతో అన్నారు. కాగా, తన రాజీనామాను డిమాండ్ చేస్తూ బీజేపీ చేస్తున్న నిరసనలపై మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య సమాధానం ఇచ్చారు. ‘నేనెందుకు రాజీనామా చేయాలి? ఎవరైనా తప్పు చేస్తే రిజైన్ చేయాలి, తప్పు చేయలేదని చెబుతున్నప్పుడు, రాజీనామా చేసే ప్రశ్న ఎక్కడ ఉంది?’ అని అన్నారు. ప్రతిపక్షాలు తనను చూసి భయపడుతన్నాయని, అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని సిద్దు ఆరోపించారు.

First Published:  27 Sept 2024 3:19 PM GMT
Next Story