Telugu Global
National

లోకాయుక్త ఎదుట హాజరైన సీఎం సిద్ధరామయ్య

మూడా కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లోకాయుక్త ఎదుట హాజరయ్యారు.

లోకాయుక్త ఎదుట హాజరైన సీఎం సిద్ధరామయ్య
X

మూడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లోకాయుక్త ఎదుట హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయను అధికారులు విచారించారు. ముగ్గురు అధికారులతో విచారించినట్లు తెలుస్తోంది. ముడా కేసులో లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్టు సీఎం తెలిపారు. వారు ప్రతిదీ రికార్డు చేశారని, అనంతరం నాకు చూపించారని చెప్పారు. ఎంక్వరీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనతాదళ్ సెక్యులర్ పార్టీలు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా తాను ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. మరోసారి విచారణ ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మళ్లీ విచారణ ఉంటుందా లేదా తనకు తెలియదని అధికారులు కూడా ఏం చెప్పలేదని వెల్లడించారు.

కేసు విషయానికి మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కి చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో కుంభకోణానికి సంబంధించింది. అయితే, వాస్తవానికి ఆయన భార్య పార్వతికి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే గ్రామంలోని 3.2 ఎకరాల భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ భూమిని ముడా సేకరించింది. ఆ భూమికి పరిహారం ఇవ్వాలని పార్వతి డిమాండ్‌ చేయడంతో ముడా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయానగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. ఈ ప్లాట్ల ధర.. ఆమె ఇచ్చిన భూమి ధర కంటే ఎంతో విలువైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కేటాయించారని మండిపడుతున్నాయి. ఈ భూ కుంభకోణం విలువ రూ.3వేలకోట్ల నుంచి రూ.4వేల కోట్ల వరకు ఉంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

First Published:  6 Nov 2024 8:13 PM IST
Next Story