దసరా తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా!
ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దసరా పండుగ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయువచ్చుని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముడా స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్దరామయ్యపై కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ద దసరా పండుగ తర్వాత ఎప్పుడైనా రాజీనామా చేయువచ్చుని అన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కన్నడ కాషాయ పార్టీ బెంగళూరు నుంచి మైసూర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. సీఎం రాజీనామా అంశాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిశీలిస్తోందని బీజేపీ చీఫ్ పేర్కొన్నారు . ఈ విషయం సిద్దరామయ్యకు కూడా తెలుసని చెప్పారు.
అందుకే తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం సిద్ధరామయ్య రోజూ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారని విజయేంద్ర అన్నారు. కానీ సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీని ఢిల్లీకి ఎందుకు పంపారని ప్రశ్నించారు. సిద్ధరామయ్య ఆధ్వర్యంలో ఈ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గరపడుతున్నాయని కేంద్రమంత్రి హెచ్ డీ కుమారస్వామి అన్నారు. వచ్చే ఎన్నికల కోసం 2028 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ దుష్ప్రవర్తన కారణంగా ముందుగా ఎన్నికలు రావచ్చుని కుమరస్వామి తెలిపారు.