పార్లమెంట్‌లో అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిరసన ర్యాలీలో కాంగ్రెస్ మాజీ మంత్రి పుష్పలీలను కిందేసి కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కిరు. కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు కావాలని కింద పడేసి తొక్కారని రేవతి లాగే తనకు జరుగుతుందని భయపడ్డానని పుష్పలీల ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు క్రమశిక్షణ లేదని, కావాలని ఇలా చేశారని ఆమె అన్నారు. ఏది ఏమైనా మహిళల పట్ల అందులోనూ దళితులపైనా ఇలాంటి ఘటనలు జరగడం మంచి కాదని తెలిపారు.
Keep Reading
Add A Comment