Telugu Global
Editor's Choice

భారీగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు

తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్ పరిధిలో కేవలం మూడు రోజుల్లో 20 శాతం మేర రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో బియ్యం, వంట నూనె ధరలు భారీగా పెరగనున్నాయి.

భారీగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
X

తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్ పరిధిలో కేవలం మూడు రోజుల్లో 20 శాతం మేర రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో బియ్యం, వంట నూనెధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, హెచ్ఎంటీ, బీపీటీ తదితర సన్న బియ్యం ధరలు కిలోకు రూ. 60 నుంచి 70 వరకు పెరగనున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు.. పెరుగుతున్న నిత్యవసర ధరలతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసిన ధరలు కొండెక్కుతున్నాయి. భారీ వర్షలకు పంటలు తీవ్రంగా దెబ్బతినటంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపాయి. డిమాండ్‌కు సరిపడా వెజ్‌టెబుల్స్ సరఫరా లేకపోవడంతో రేట్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పెరిగింది. మార్కెట్‌లో రూ.60 పలుకుతోంది.ఇక టమాట రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర రూ. 40 నుంచి 50 మధ్య నడుస్తోంది. పచ్చిమిర్చి ధర రూ. 65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర రూ. 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు.

ఇక చిక్కుడ ధర రూ. 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 50 - 60 మధ్య ఉంది. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి.హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. అందులో 15 శాతం వరకే తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, శామీర్‌పేట, ములుగు, గజ్వేల్, భువనగిరి, జహీరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువ కూరగాయలు పండిస్తారు .ఇక ఎక్కువశాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం.. మన దగ్గర మిగతా సీజన్లలో పండిన కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే.. అటు రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ధరల నియంత్రణతో వినియోగదారులకూ లాభం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

First Published:  30 Sept 2024 3:00 PM IST
Next Story