Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, June 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Editor's Choice

    భారీగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు

    By Vamshi KotasSeptember 30, 20242 Mins Read
    భారీగా పెరిగిన నిత్యవసర ధరలు.. ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తెలంగాణలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్ పరిధిలో కేవలం మూడు రోజుల్లో 20 శాతం మేర రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో బియ్యం, వంట నూనెధరలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం సోనామసూరి, హెచ్ఎంటీ, బీపీటీ తదితర సన్న బియ్యం ధరలు కిలోకు రూ. 60 నుంచి 70 వరకు పెరగనున్నాయి. సామాన్య ప్రజలు ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు.. పెరుగుతున్న నిత్యవసర ధరలతో పేద ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ వస్తువు టచ్ చేసిన ధరలు కొండెక్కుతున్నాయి. భారీ వర్షలకు పంటలు తీవ్రంగా దెబ్బతినటంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలుపాయి. డిమాండ్‌కు సరిపడా వెజ్‌టెబుల్స్ సరఫరా లేకపోవడంతో రేట్లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉల్లి ధర భారీగా పెరిగింది. మార్కెట్‌లో రూ.60 పలుకుతోంది.ఇక టమాట రేట్లు భారీగా పెరిగాయి. ఏకంగా కేజీ ధర రూ. 40 నుంచి 50 మధ్య నడుస్తోంది. పచ్చిమిర్చి ధర రూ. 65 నుంచి 80 మధ్య ఉంది. ఇక బీన్స్ ధర చెప్పలేనంత స్థాయిలో పలుకుతోంది. కిలో ధర రూ. 110 నుంచి 120 మధ్య విక్రయిస్తున్నారు.

    ఇక చిక్కుడ ధర రూ. 50 నుంచి 60 మధ్య ఉంది. బెండకాయ కిలో ధర రూ. 50 – 60 మధ్య ఉంది. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర ఇతర ఆకుకూరల ధరలు కూడా రెట్టింపయ్యాయి.హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. అందులో 15 శాతం వరకే తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్‌ చుట్టూ ఉన్న చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, శామీర్‌పేట, ములుగు, గజ్వేల్, భువనగిరి, జహీరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ఎక్కువ కూరగాయలు పండిస్తారు .ఇక ఎక్కువశాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం.. మన దగ్గర మిగతా సీజన్లలో పండిన కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌ స్టోరేజీలు లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే.. అటు రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ధరల నియంత్రణతో వినియోగదారులకూ లాభం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

    Telangana Vegetable prices
    Previous Articleదేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు
    Next Article కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరిన దేవర మూవీ!
    Vamshi Kotas

    Keep Reading

    ప్రారంభమైన 6 ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

    పేరు రైతులది.. పైసలు కాంట్రాక్టర్లకు!

    రెండు రాష్ట్రాలు తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి : కేఆర్‌ఎంబీ

    రేవంత్‌ విన్నపాలపై రాహుల్‌ రాడార్‌!

    వివాదాలు, విభేదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా కాంగ్రెస్‌

    అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ సర్కార్‌ కొనసాగించాలి

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.