Telugu Global
Editor's Choice

స్కాం స్టర్‌, ఉన్నతాధికారిపై సీఎంవో సీరియస్‌!

క్లాస్‌ పీకిన ముఖ్యులు.. సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారి

స్కాం స్టర్‌, ఉన్నతాధికారిపై సీఎంవో సీరియస్‌!
X

తెలుగు గ్లోబల్‌ ఎఫెక్ట్‌

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖకు తానే షాడో మినిస్టర్‌ అని చెప్పుకుంటున్న స్కాం స్టర్‌ తో పాటు మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారిపై సీఎంవో సీరియస్‌ అయ్యింది. ''మైత్రివనం కేంద్రంగా స్కాం స్టర్‌!'' శీర్షికన ''తెలుగు గ్లోబల్‌'' ప్రచురించిన ఎక్స్‌క్లూజివ్‌ స్టోరీకి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించి తనకు పూర్తి వివరాలు చెప్పాలని ఆదేశించారని సమాచారం. సీఎం రేవంత్‌ రెడ్డి సన్నిహితుడు, ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒకరు సదరు స్కాం స్టార్‌ కు క్లాస్‌ పీకారని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. ఏదైనా చేస్తే గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలే తప్ప ప్రతి ఫైల్‌ క్లియర్‌ చేయడానికి బేరాలు పెట్టడమని ఏమిటని స్కాం స్టర్‌ ను నిలదీసినట్టు తెలిసింది. బాస్‌ చాలా సీరియస్‌ గా ఉన్నారని.. ఇలాంటి పనులు కొనసాగించి బాస్‌ కు ఇబ్బంది తేవొద్దని అల్టిమేటం ఇచ్చినట్టుగా తెలిసింది. బాస్‌ ఢిల్లీ నుంచి వచ్చాక ఆయనే స్వయంగా ఈ విషయం మాట్లాడుతారని.. అప్పటి వరకు మున్సిపల్‌ శాఖ వ్యవహారాల్లో తలదూర్చొద్దని లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేశారని తెలిసింది. మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారిపైనా సీఎంవో సీరియస్‌ అయ్యింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడు అయినంత మాత్రాన ఆయన చెప్తేనే ఫైల్‌ క్లియర్‌ చేస్తామన్నట్టుగా వ్యవహరించడం ఏమిటని నిలదీసినట్టుగా తెలిసింది. రెగ్యులర్‌ డ్యూటీ చేయడానికి ఇబ్బంది ఏమిటని.. అంతగా పని చేయాలని లేకుంటే ఏదో ఒక శాఖకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తామని కటువుగానే హెచ్చరించినట్టుగా తెలిసింది. సీఎంవో నుంచి క్లాస్‌ పీకడంతో సదరు ఉన్నతాధికారి కింది సిబ్బందిపై ఫైర్‌ ద ఫైర్‌ అయ్యారని చెప్తున్నారు. మంగళవారం ఆఫీస్‌ కు వెళ్లిన కాసేపటికే ఫైళ్ల పెండింగ్‌ సహా డిపార్ట్‌మెంట్‌ వ్యవహారాలపై సీఎంవో నుంచి ఫోన్‌ వచ్చిందని.. ఫోన్‌ లో క్లాస్‌ పీకడంతో ఆ ఫ్రస్ట్రేషన్‌ తన కింది సిబ్బందిపై చూపించారని చర్చ సాగుతోంది. ఆ ఫోన్‌ వచ్చిన తర్వాత కేవలం పది నిమిషాలు మాత్రమే ఆఫీస్‌ లో ఉన్నతాధికారి ఆ తర్వాత కాసేపటికే తీవ్రమైన కోపంతో ఆఫీస్‌ నుంచి వెళ్లిపోయారని చెప్తున్నారు.

First Published:  12 Nov 2024 8:15 PM IST
Next Story