సీఎం రేవంత్ రెడ్డి నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు సంక్షేమ పథకాలపై ప్రకటనలు చేయనున్నారు. మొదట శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక జడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలవనున్నారు. వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభించనున్నారు. మహిలలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొననున్నారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Previous Articleవైభవంగా ప్రారంభమైన శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
Next Article అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరుల విధ్వంసం
Keep Reading
Add A Comment