Business
ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.
ఫిలిప్స్ కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కోవిడ్ పరిస్థితి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తమ సంస్థ ప్రదర్శనపై ప్రభావం చూయించాని, అందువల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫిలిప్స్ సీఈవో రాయ్ జాకబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్ఫోసిస్ లో వయస్సు, లింగభేదం, జాతీయత ఆధారంగా వివక్ష ఉందని అమెరికా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, పిల్లలు ఉన్న మహిళలు ,50 ఏళ్లు పైబడిన అభ్యర్థులను నియమించుకోవద్దని సంస్థ తనను కోరినట్లు ఇన్ఫోసిస్ టాలెంట్ అక్విజిషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జిల్ ప్రీజీన్ ఆరోపించారు.
చాలా మంది కంపెనీని వీడి ఇతర సంస్థల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ, వారిని తొలగిస్తుండటమే అసలు కారణమని.. చాలా మంది ఉద్యోగుల ఇంకా ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కోలేదని తెలుస్తున్నది.
డిజిటలైజేషన్‌తో ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరగడంతో వలసల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఉద్యోగులు వలస వెళ్లకుండా ఆయా కంపెనీలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో వారు వెంటనే కంపెనీ మారిపోతున్నారు.
ఇప్పటి వరకు కార్డ్ వివరాలన్నీ వెబ్ సైట్స్ లో ఆటోమేటిక్ గా సేవ్ అయ్యేవి. ఇకపై అలా జరగదు. అక్టోబర్-1నుంచి ఆర్బీఐ రూపొందించిన కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.
ఒక్కో ఓటీటీకి ఒక్కో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం చాలామందికి ఆర్థికంగా భారమనిపించొచ్చు. అందుకే ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే.. తాజాగా టాటా ప్లే బింజ్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది.
వాట్సప్ పేకు రాజీనామా చేసిన మనేశ్ మహాత్మే తిరిగి అమెజాన్ ఇండియాలో స్ట్రాటజిక్ రోల్‌లో చేరబోతున్నట్లు సమాచారం. మనేశ్ కంపెనీని వదిలేసినట్లు ‘మెటా’ కూడా ధృవీకరించింది. వాట్సప్ పేమెంట్ విభాగం అభివృద్ధికి మనేశ్ చాలా కృషి చేశారని చెప్పింది
విప్రో సంస్థలో చాలా మంది మూన్ లైటింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత రెండు నెలల్లో మూన్ లైటింగ్ చేస్తున్న 300 మందిని గుర్తించి విధుల నుంచి తొలగించినట్లు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ వెల్లడించారు.