Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Business

    ఎల‌న్ మస్క్ శ్రమ దోపిడి…. ట్విట్టర్ ఉద్యోగులకు రోజుకు 12 గంటలు, 7 రోజులు పని

    By Telugu GlobalNovember 2, 20222 Mins Read
    ఎల‌న్ మస్క్ శ్రమ దోపిడి.... ట్విట్టర్ ఉద్యోగులకు రోజుకు 12 గంటలు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థని కొన్నప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయి. ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్న తొలి రోజే సీఈవో పరాగ్‌ అగర్వాల్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నెడ్‌ సెగల్‌, పాలసీ చీఫ్‌ విజయా గద్దెలను తొలగించారాయన. ఆ తర్వాత బ్లూ టిక్ బ్యాడ్జ్ ఉన్న వినియోగదారుల నుండి నెలకు మన కరెన్సీలో దాదాపు 1,600 రూపాయలను వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని 660 రూపాయలకు తగ్గిస్తానని మస్క్ చెప్పారు.

    ఇప్పుడిక ఆయన తీసుకున్న మరో నిర్ణయంతో ట్విట్టర్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. CNBC ఛానల్ నివేదిక ప్రకారం… కొంతమంది ట్విట్టర్ ఇంజనీర్లు రోజుకు 12 గంటలు, వారానికి ఏడు రోజులు పని చేయాలని ఎలన్ మస్క్ ఆదేశించారు. లేదంటే ఉద్యోగాలను కోల్పోతారని ఆయన హెచ్చరించారు.

    ఇలా పని చేసినందుకు ఆ ఉద్యోగులకు ఓవర్ టైం పేమెంట్ కూడా ఇవ్వరు. ఓవర్ టైం పేమెంట్ గురించికానీ, ఉద్యోగ భద్రత గురించి కానీ ఎటువంటి చర్చ లేకుండానే ఉద్యోగులను అదనపు గంటలు పని చేయమని కోరినట్లు CNBC వెల్లడించింది. తాము విధించిన గడువు నవంబర్ 7 లోగా ఉద్యోగులు తమ టాస్క్ పూర్తి చేయకపోతే 50 శాతం ఉద్యోగులను తొలగిస్తామని ఎలన్ మస్క్ తేల్చి చెప్పేశారు.

    మరోవైపు ఎలాన్‌ మస్క్‌ వచ్చిన తర్వాత ఆయన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగించగా మరికొంతమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. తాజాగా ట్విట్టర్‌ చీఫ్ కస్టమర్ ఆఫీసర్, ప్రకటనల విభాగం అధిపతి సారా పెర్సోనెట్‌, చీఫ్‌ పీపుల్ అండ్ డైవర్సిటీ ఆఫీసర్ దలానా బ్రాండ్, కోర్ టెక్నాలజీస్ జనరల్ మేనేజర్ నిక్ కాల్డ్‌వెల్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లెస్లీ బెర్లాండ్, ట్విటర్ ప్రొడక్ట్ హెడ్ జే సుల్లివన్, గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ జీన్-ఫిలిప్ మహ్యూ కూడా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు.

    Elon Musk Twitter
    Previous ArticleRam Charan not working with Jersey director
    Next Article Why Pawan Kalyan fails to motivate people to revolt on Jagan rule?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.