Author: Sarvi

ఇటీవల చంద్రబాబు కంటే వైసీపీ నాయకులు ఎక్కువగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. మంత్రులు, మాజీ మంత్రులు కూడా పవన్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి ధనవాణిగా పేర్కొంటే.. అసలు జనసేననే ధనసేనగా అభివర్ణించారు ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇప్పటి వరకూ పవన్ ని దత్తపుత్రుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ నేతలు.. ఇప్పుడు ఆయన పార్టీని కూడా ధనసేన అంటూ […]

Read More

రాజమౌళికి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని రాష్ట్రపతి కోటాలో పెద్దల సభకు రికమెండ్ చేసింది కేంద్రం. సోషల్ మీడియాలో రాజమౌళికి, ఆయన తండ్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా విజయేంద్రప్రసాద్ కి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే ఈ విషయానికీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ ఈ ప్రకటన వెలువడినప్పటినుంచీ బండి సంజయ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా […]

Read More

ఇటీవల ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు పవన్ కల్యాణ్. జనవాణి అనే పేరుతో గత ఆదివారం అర్జీలు స్వీకరించిన పవన్, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చేవారం అవసరమైతే మళ్లీ జనవాణి నిర్వహిస్తామన్నారు. పవన్ కల్యాణ్ జనవాణిపై తాజాగా సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కి ‘జనవాణి’ తెలియదని, ఆయనకు తెలిసింది ‘ధనవాణి’ మాత్రమేనని అన్నారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు.. ఆఖరికి ఇతర […]

Read More

విమానయాన పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘సాఫ్రాన్’ హైదరాబాద్ లో మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ (MRO) ప్రారంభించబోతోంది. విశేషం ఏంటంటే.. ప్రపంచంలోనే ఆ సంస్థకు ఉన్న మెగా ఏరో ఇంజిన్ ప్రాజెక్ట్ లలో ఇదే అతి పెద్దది అవుతుంది. ఈ నేపథ్యంలో సాఫ్రాన్ గ్రూప్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. సాఫ్రాన్ కంపెనీకి సాదర స్వాగతం అంటూ ఆయన ట్వీట్ చేశారు. భారతదేశంలో తన మెగా ఏరో ఇంజిన్ (MRO) కోసం […]

Read More

చమరు కంపెనీలు మరోసారి సామాన్యులపై భారం మోపాయి. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధరపై రూ. 50 పెంచాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో రూ. 1003 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర జూలై 6 నుంచి రూ. 1053కు, హైదరాబాద్‌లో రూ. 1055 ఉన్న ధర రూ. 1105కు చేరింది. దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల 1న గ్యాస్ ధరలపై మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈ నెల […]

Read More

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ పై దాడి కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు, అతని కుమారుడు భరత్ సహా మరికొందరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను కూడా సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అయితే ఈ కేసు విషయంలో తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర.. ఉద్దేశపూర్వకంగానే తమను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం […]

Read More

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అతడిపై పలు స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలు రావడంతో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మొదలైంది. గత నెలలో అవిశ్వాస తీర్మానాన్ని 12 ఓట్ల తేడాతో గెలిచి ప్రస్తుతానికి తన పదవిని కాపాడుకున్నారు. దీంతో ఆయన మరో ఏడాది పాటు ఆ పదవిలో ఉండేలా అవకాశం లభించింది. కానీ తన సొంత పార్టీ (కన్జర్వేటీవ్ పార్టీ) మాత్రం నిబంధనలు మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన […]

Read More

రాజకీయ ప్రత్యర్థులు మాటలతో దాడులు చేసుకోవడం ఏనాటి నుండో చూస్తున్నాము. ప్రెస్ మీట్‌లోనో.. బయట సభల్లోనే తమ ప్రత్యర్థిపై మాటలతో నిలదీయడం సాధారణమైన విషయమే. కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయ ప్రత్యర్థుల మాటల యుద్దం కూడా రూట్ మార్చుకుంది. సోషల్ మీడియాలో మీమ్స్‌ (వ్యంగ్య ఫొటోలు, వీడియోలు) దాడులు చేసుకుంటున్నారు. 2016 యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ మీమ్స్ దాడులు రాజకీయాల్లో బాగా పాపులర్ అయ్యాయి. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు డొనాల్డ్ ట్రంప్, హిల్లరి క్లింటన్‌లు […]

Read More

రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించాలనేది వైసీపీ టార్గెట్. అది ఇప్పటికిప్పుడు పెట్టుకున్న లక్ష్యం కాదు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు పోతోంది. 1989 నుంచి చంద్రబాబుకు కంచుకోటలా మారిపోయిన కుప్పం నియోజకవర్గంలో.. లక్షకు తగ్గని మెజారిటీతో ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే గత ఎన్నికల్లో ఆ మెజార్టీని 30 వేల ఓట్లకు తగ్గించడంలో వైసీపీ విజయవంతం అయ్యింది. ఇక రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం నుంచి బాబును పంపేయడమే లక్ష్యంగా […]

Read More

ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు (68) మంగళవారం అర్థరాత్రి 1 గంటకు (తెల్లారితే బుధవారం) మృతి చెందారు. గత కొంత కాలంగా లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం కూడా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించారు. అనంతరం ఇంటికి వచ్చిన ఆయన అర్థరాత్రి సమయంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మరణ వార్త తెలుసుకొని సినీ పరిశ్రమ విషాదంలో మునిగిసోయింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు […]

Read More