ఇటీవల ముగిసిన వైసీపీ ప్లీనరీ పలు విషయాలను తేటతెల్లం చేస్తోంది. ఇప్పటివరకూ తండ్రి పేరును ప్రస్తావిస్తూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానంటూ చెప్పుకొచ్చిన జగన్ ఆయన నీడనుంచి బయటపడి సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ప్రయత్నాల్లో సపలీకృతుడయినట్టేనని భావిస్తున్నారు.
Author: Sarvi
సాంకేతికత, ఆవిష్కరణల విశ్వకేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ హైటెక్ సిటీలో ‘ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్’ను ఆయన ప్రారంభించారు. ‘ఎక్స్ పీరియన్’ సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అగ్రస్థానంలో ఉంది. డేటా, అనలిటికల్ టూల్స్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సంస్థగా ఎక్స్ పీరియన్ కు గుర్తింపు ఉంది. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన ఈ సంస్థ, హైదరాబాద్ వేదికగా ‘ఎక్స్ పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్’ ఏర్పాటు చేసింది. […]
బయట వర్షం పడుతున్నపుడు వేడిగా పకోడీలు తినాలని, అలాగే వేడివేడి కాఫీ, టీలు తాగాలని చాలామందికి ఉంటుంది కదా. అలాగే మసాలా దట్టించిన రుచికరమైన వంటకాలు సైతం తినాలనిపించవచ్చు. అయితే వర్షం వస్తున్నపుడు మనకు నచ్చిన ఆహారాలన్నీ తినేయవచ్చా.. అలా తినటం వలన ఏవైనా ఇబ్బందులు ఉంటాయా, వానాకాలం ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈ అంశాలను తెలుసుకుందాం.. వర్షాకాలంలో అజీర్తి, నీటి ద్వారా వచ్చే వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. […]
ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ […]
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశం నుంచి పరారయ్యారు. భార్య, బాడీగార్డులతో సహా ఆయన నిన్న రాత్రి మిలిటరీ విమానంలో మాల్దీవులకు పారిపోయారు. నిజానికి ఆయన నేడు తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. కానీ రాజీనామా తరువాత తనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందేమోనన్న భయంతో ఆయన పారిపోయినట్టు భావిస్తున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొటబాయ మాల్దీవుల రాజధాని మాలేకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గొటబాయతో బాటు ఆయన కుమారుడు, ఇతర కుటుంబసభ్యులు కూడా పరారయినట్టు […]
ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అధ్యక్షభవనాన్నే ఆక్రమించుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేశారు. అయినప్పటికీ అక్కడ ప్రజల నిరసనలు ఆగడంలేదు. అక్కడి నిరసనకారులు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన మిత్రుడు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మీద కూడా నిప్పులు చెరుగుతున్నారు. తమ దేశాన్ని సర్వనాశనం చేసిన తమ నాయకులను తమ చెప్పుచేతుల్లో […]
ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోర్డింగ్ లు, బ్యానర్లతో తెలంగాణలో మోదీకి తీవ్ర అవమానం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన హ్యాష్ ట్యాగ్ లతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు జనసైనికులు. ఏపీలో రోడ్ల దుస్థితిపై ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయాలనుకుంటున్నారు. ఇలా […]
ఓ మనిషి సక్సెస్ అయ్యాడంటే అతి అతడి గొప్పదనం మాత్రమే కాదు. అతడి ఎదుగుదలకు ఎంతోమంది సాయం చేసి ఉంటారు, మరికొందరు పరోక్షంగా పనికొచ్చి ఉంటారు. అలాంటి వాళ్లందర్నీ గుర్తుపెట్టుకోవాలి, వీలైతే జీవితంలో ఒకసారైనా వాళ్లను మళ్లీ కలవాలి. నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా థీమ్ ఇదే. కొద్ది సేపటి కిందట విడుదలైన ట్రయిలర్ లో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. నాగచైతన్య థాంక్యూ సినిమా కథ ఏంటి? అందులో ఎమోషన్ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ […]
జపాన్ లో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఆన్ లైన్ లో ఎవరినైనా అవమానించినట్టు తేలితే ఏడాదిపాటు జైలు శిక్ష విధిస్తారు. లేదా 3 లక్షల యెన్ లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అవమానం అంటే పూర్తి స్థాయిలో నిర్వచనం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. ఈ చట్టం భావప్రకటనా స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందో లేదో తెలుసుకోవడానికి 2025లో మళ్లీ దీన్ని […]
శ్రీలంక ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఏం కొనేటట్టులేదు, ఏం తినేటట్టులేదు. చివరకు ఓ మోస్తరు ధనవంతులు కూడా రోడ్డునపడే పరిస్థితి. ప్రస్తుతం శ్రీలంక వాసుల్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ కట్టెలపొయ్యిలే దిక్కయ్యాయి. అపార్ట్ మెంట్లలో ఉండేవారు కూడా కిందకు దిగొచ్చి కట్టెలపొయ్యిపై వంట చేసుకుంటున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో క్యారెట్ రూ.490గా ఉండగా.. కిలో ఉల్లి 200కు చేరింది. బంగాళా దుంప కేజీ రూ.220 గా ఉంది. గ్రాము […]