ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు […]
Author: Sarvi
జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశాన్ని నాగబాబు వాడుకున్నారా..? లేక మోదీ, జగన్ సాన్నిహిత్యం చూసి ఆయన ఈ కౌంటర్ వేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మంటపెట్టింది. వైసీపీ, బీజేపీ అభిమానులు కూడా నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే..? అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ గురించి నాగబాబు కాస్త […]
కోహ్లీ ముద్దు పేరు చీకూ. కానీ అభిమానులు మాత్రం రన్ మెషిన్ (పరుగుల యంత్రం) అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2008లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కోహ్లీ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. వందకు పైగా టెస్టులు, 250కిపైగా వన్డేలు, దాదాపు 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. తన బ్యాటు నుంచి పరుగుల వరద పారించాడు. మూడేళ్ల క్రితం నాటికే టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరి సారిగా బంగ్లాదేశ్‌తో 2019 నవంబర్‌లో […]
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గురువారం నాడు తన పదవికి రాజీనామా చేశారు. నిన్నటి నుండి వరసగా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు రాజీనామాలు చేస్తుండటంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొంది. దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోరిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను ప్రధాని జాన్సన్ తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని మొత్తం మంత్రివర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ బోరిస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దాంతో […]
నిరుపేద మైనార్టీలు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడంలో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2015 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దుల్హన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మైనార్టీల వివాహాలకు ప్రభుత్వం 50 వేల రూపాయల సహాయం చేసేది. అయితే ఎన్నికల సమయంలో దుల్హన్ పథకాన్ని కొనసాగించడమే కాక 50 వేలకు బదులు లక్షరూపాయలు ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆ పథకాన్ని నిలిపివేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న […]
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా పశువులను తీసుకెళ్తున్న వాహనాలను వెంబడించడం, వ్యక్తులపై దాడులకు దిగడం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ హిందూ సంస్థలతో సీవీ ఆనంద్ సమావేశమయ్యారు. లవ్ ఫర్ కౌ, తెలంగాణ గోశాల, కౌ జ్ఞాన్ ఫౌండేషన్, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ తదితర సంస్థల ప్రతినిధులు, సీనియర్ […]
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి ట్రోలర్లకు చిక్కారు. తనను తాను నిత్యం ప్రమోట్ చేసుకునే చంద్రబాబు.. గొప్పలు చెప్పుకుంటూ ఇప్పటికే చాలా అలుసైపోయారు. అయినా సరే.. తన ధోరణిలో తాను వెళ్తూనే ఉంటారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అబద్దాలు చెప్తూ, తప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆ మధ్య బిల్‌గేట్స్, తనకు మధ్య కంప్యూటర్ గురించి వచ్చిన చర్చను చెప్పారు. ఇద్దరం కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ నొక్కితే.. అది […]
తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. రాష్ట్ర అభివృద్ధి, నిధుల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఎన్నాళ్ల నుంచో టీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన పీఎం మోడీకి స్వయంగా సీఎం కేసీఆర్ నిధులు, అభివృద్ధి విషయంలో పలు ప్రశ్నలు బహిరంగంగానే సంధించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభలో మోడీ.. తెలంగాణకు కేంద్రం చేసిన పనుల గురించి వివరించే ప్రయత్నం చేశారు. కానీ, దీని వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రధాని ప్రసంగాన్ని […]
హైదరాబాద్ శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగర శివారు పటాన్‌చెర్వు ప్రాంతంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పటాన్‌చెర్వు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోడి పందాలు జరుగుతున్న ప్రాంతంలో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 70 మంది అక్కడ కోడి పందాల్లో పాల్గొని పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా, దాడి చేసే సమయానికి 70 మందిలో 49 మంది […]
ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ తన ప్రసంగంలో పలు మార్లు ‘భాగ్యనగరం’ అని సంబోధించారు. బీజేపీ నాయకులు కూడా గత కొన్నాళ్లుగా హైదరాబాద్ పేరును కాకుండా భాగ్యనగరం అనే పిలుస్తున్నారు. మీడియాకు పంపే లెటర్ హెడ్స్‌లో కూడా హైదరాబాద్ అని ఎక్కడా కనిపించదు. విజయ సంకల్ప సభలో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును మళ్లీ భాగ్యనగరంగా మారుస్తాము అని చెప్తున్నారు. అసలు ఈ నగరం పేరు హైదరాబాదా? లేదా […]