వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే : బొత్స
ప్రజా సమస్యలు వినిపించేందుకు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన సభలో సభ్యులు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్నిపరక్షించాలని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసన సభలో డిమాండ్ చేసినట్లు వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారయణ డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం. ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రధాన ప్రతిపక్షానిదే.
రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని బొత్స అన్నారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదని బొత్స పేర్కొన్నారు