వైసీపీ ఫీజు పోరు మార్చి 12కి వాయిదా
వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది.
ఏపీలో విద్యార్ధులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని వైసీపీ తల పెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ కోరింది.
అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూటమి సర్కార్ ఈ స్కీమ్ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.