Telugu Global
Andhra Pradesh

సీఎం చంద్రబాబుతో కలిసి పని చేయడం చాలా కష్టం : మంత్రి లోకేష్

ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం చాల కష్టమని మంత్రి లోకేశ్ అన్నారు.

సీఎం చంద్రబాబుతో కలిసి పని చేయడం చాలా కష్టం : మంత్రి లోకేష్
X

సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం చాల కష్టమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. తెలుగు ప్రవాసులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్‌లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది.

యూరప్‌లో తెలుగు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. యూరప్‌లో క్రిప్టో తరహా ఆర్థిక వ్యవస్థను స్టార్టప్‌గా పెట్టామని తెలుగు పారిశ్రామిక వేత్తలు వివరించారు. ఏపీని క్రిప్టోజోన్‌, క్రిప్టో ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే అవకాశముందని తెలిపారు. దీనిపై చంద్రబాబు పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌, మంత్రి టీజీ భరత్‌ ఉన్నారు.

First Published:  20 Jan 2025 6:40 PM IST
Next Story