Andhra Pradesh
ఎర్ర మట్టి దిబ్బల తవ్వకం వెనక బులుగు ముఠా ఉందని, విచారణ మొదలైందని, ఎవర్నీ వదిలిపెట్టేది లేదని టీడీపీ అంటోంది.
తాజాగా పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల శిలాఫలకాలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. ఎర్రమట్టి దిబ్బల్లో జరిగిన తవ్వకాల దగ్గర సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ప్రపంచంలో పేరు మార్చుకుంటానంటూ ఛాలెంజ్ చేసిన ఏ ఒక్కరూ ఆ పని చేసి ఉండరని, కానీ తొలిసారి అలాంటి వ్యక్తి ముద్రగడను తాను చూస్తున్నానని చెప్పారు అంబటి.
జీపీఎస్ జీఓ విషయంలో మరో ఇద్దరు అధికారులపై వేటుపడే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో సహా టీడీపీ అనుకూల మీడియా లీకులివ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
మచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
మీడియా అంటే తనకు గౌరవం ఉందని, తానెప్పుడూ మీడియా ప్రతినిధులను దూషించలేదని వివరణ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి.
ఇప్పటికే ఉచిత ఇసుక కొండెక్కిందని, తల్లికి వందనం పథకం అమలులో కోత పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే సూపర్ సిక్స్, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో, ఎంత ఖర్చు చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నిన్న(మంగళవారం) కేబినెట్ భేటీ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఫ్రీ బస్ పథకంపై ట్వీట్ పెట్టి డిలీట్ చేయగా.. మరో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని అమిత్ షా ని కోరినట్టు చంద్రబాబు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.