Andhra Pradesh
జగన్ తో ఎంతమంది కలసి నడుస్తారు, ఎంతమంది ఢిల్లీ ధర్నాకు ఎగ్గొడతరానేది ఆసక్తికరం.
. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే మోసపూరిత హామీల గుట్టు బయటపడుతుందన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే రాష్ట్రంలో అరాచకాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు జగన్.
ఏపీలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షిద్దామని చెప్పారు.
వివేకా హంతకులతో కలసి జగన్ తిరుగుతున్నారని, బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఆయన ఎందుకు ధర్నా చేయలేదని లాజిక్ తీశారు షర్మిల.
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో తనకు పెద్ద పదవి వస్తుందని భావించారు RRR. స్పీకర్ పదవి తనదేనని చెప్పుకున్నారు. స్పీకర్ పదవి లేకపోతే కేబినెట్‌లోనైనా చోటు దక్కుతుందని భావించారు.
జగన్ చెవిలో రఘురామకృష్ణం రాజు ఏదో చెప్పడం కనిపించింది. దీంతో రఘురామకృష్ణం రాజు జగన్తో ఏం మాట్లాడాడు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ప్రభుత్వం మారినా పోలీసులకు మాత్రం తిట్లు కామన్ అయిపోయాయి. అప్పట్లో లోకేష్ ఆవేశపడుతుంటే సైలెంట్ గా నిలబడిన పోలీసులు ఇప్పుడు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
గవర్నర్ ప్రసంగం మొదలు కాగానే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వుయ్ వాంట్ జస్టిస్, సేవ్ డెమొక్రసీ అంటూ వారి స్థానాల్లోనే లేచి నిలబడి నినాదాలు చేశారు.
ఎల్లకాలం ఒకే మాదిరిగా ఉండదంటూ అక్కడున్న మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం పోలీసుల విధి అని గుర్తు చేశారు జగన్.
అధికార ప్రతినిధి అరెస్ట్ అక్రమం అని అంటున్నారు వైసీపీ నేతలు. అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు ఆదేశాలున్నా పోలీసులు అత్యుత్సాహం చూపించారని విమర్శించారు.