Andhra Pradesh
సినిమాల్లో ఎప్పుడూ విలన్లతో ఫైటింగ్ చేసే పవన్ కల్యాణ్ కూడా నిజ జీవితంలో ఈ కేసుల వల్ల రోడ్డుపై పడుకోవాల్సి వచ్చిందన్నారు చంద్రబాబు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు.
మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు ఫైళ్ల దహనం ఘటనపై టీడీపీ నేతలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు మెప్పు పొందాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 40 శాతం ప్రజలు విజ్ఞతతోనే వైసీపీకి ఓటేశారని, కూటమి పేరుతో మూడు పార్టీలూ కలిసి ఎలా గెలిచాయో దేవుడికే తెలుసని ఆయన చెప్పారు.
జనసేన నేత నాగబాబు.. ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణను నాగబాబు ట్విట్టర్ ద్వారా ప్రజల ముందు ఉంచారు.
చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న మోహన్ తరచూ తిరుపతిలోని అన్న వద్దకు వచ్చి వెళుతుండేవాడు. అదే విధంగా రెండు రోజుల క్రితం తిరుపతికి వచ్చిన మోహన్.. బుధవారం సాయంత్రం అన్న కుమార్తెలు దేవశ్రీ (13), నీరజ (10)లను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటివద్ద దింపి బయటికి వెళ్లాడు.
నడిరోడ్డు మీద హత్య చేస్తేనే పోలీసులు ఏమీ చేయలేదు.. కర్రలతో కొడితే దిక్కెవరంటూ హోం మంత్రి అనితను ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
తనతో ఏ మీటింగ్ కూడా గంటకంటే ఎక్కువ ఉండదన్నారు చంద్రబాబు. సుత్తికొట్టను, సూటిగా పాయింట్ కొచ్చేస్తానంటూ అధికారుల సమీక్షలో తేల్చి చెప్పారు.
వైసీపీకి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు జగన్. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని అసెంబ్లీలో చెప్పారు చంద్రబాబు. సరైన పాలసీ తీసుకొచ్చి పేదలకు అందుబాటు ధరలో మద్యం లభించే విధంగా చూస్తామన్నారు.
ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదని, జగన్ తన కార్యకర్తల కోసం పోరాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలమన్నారు. పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదన్నారు.