Andhra Pradesh
సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలని జనం ఎవరూ జగన్ ని అడగలేదని, కానీ తనకు తానే తగ్గించి ఆయన సినిమావాళ్లకు దూరమయ్యారని చెప్పుకొచ్చారు కేతిరెడ్డి.
వైసీపీకి చెందిన స్థానిక సంస్థల నేతలు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీని నిండా ముంచేసింది వైసీపీ అని టీడీపీ నేతలు అంటుంటే, అసలు ఆరోగ్యశ్రీనే ముంచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిశారు. వారందరికీ ధైర్యం చెప్పారు.
అసలు పథకాలు అమలు చేయండి అని అడుగుతుంటే కొసరు పథకం పట్టాలెక్కించి సూపర్ సిక్స్ మొదలు పెట్టాం అంటూ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది.
వైసీపీలో ఎవరూ నెంబర్-2 లు లేరని, టీడీపీలో ఉంటారని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు. టీడీపీలో నెంబర్1, 2 ఉన్నారని, బయటి వ్యక్తి నెంబర్-3 గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
నిధుల కొరత ఉందని గతంలో చంద్రబాబు అమరావతికోసం విరాళాలు సేకరించారు. 2019లో ప్రభుత్వం మారాక ఈ హడావిడికి బ్రేక్ పడింది. మళ్లీ 2024లో చంద్రబాబు సీఎం అయ్యాక విరాళాల సీజన్ మొదలైంది.
ఆగస్ట్-1 వతేదీ ఉదయం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తవ్వాలని మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఆరోజే 99 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని డెడ్ లైన్ పెట్టారు.
ప్రభుత్వ విద్యా విధానాన్ని మెరుగు పరిచి, ప్రైవేటు కోచింగ్ సెంటర్లను నిషేధించాలని సూచించారు విజయసాయిరెడ్డి.