Andhra Pradesh

ఇప్పటికే పలుమార్లు కమిషనర్‌తో అమర్యాదకరంగా ప్రవర్తించిన వీరు, సోమవారం ఆయన్ని ముట్టడించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని చుట్టుముట్టి బెదరగొట్టారు.

సాక్షి కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరువు సమయంలో రాయలసీమ ప్రాంత వాసుల ఆకలి తీర్చిన బుడ్డా వెంగళరెడ్డికి గుర్తింపునివ్వాలని స్థానిక నేతలు తమ వాదన వినిపిస్తున్నారు.

గతంలో ఎలాంటి సెక్యూరిటీ ఉందో, అదే సెక్యూరిటీ కావాలంటున్నారు జగన్. సీఎంగా దిగిపోయిన తర్వాత కూడా సీఎం స్థాయి సెక్యూరిటీ ఇవ్వడం ఎలా సాధ్యమని టీడీపీ ప్రశ్నిస్తోంది.

మ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 640కి పైగా ఓట్లు ఉన్నాయని, టీడీపీ కూటమికి 200 ఓట్లు కూడా లేవని, కానీ వాళ్లు దురుద్దేశపూర్వకంగా పోటీకి దిగుతున్నారని ఇది అన్యాయం అని అన్నారు బొత్స.

గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, తమకు ఖాళీ ఉన్న సమయాల్లో రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకునేవారని, కానీ జగన్ నిర్ణయం వల్ల వీధుల్లో బండ్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం వచ్చిందన్నారు చంద్రబాబు.

ఏపీలో రోజురోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పారు.

జూన్ 3వ తేదీ నాటికి తనకు ఉన్న భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు జగన్. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగా లేదని కోర్టుకి తెలిపారు.

ఓ పక్క రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని ఫుల్‌స్టాప్‌ లేకుండా అమలు చేస్తూ.. మరోపక్క తన అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

గత ఐదేళ్లలో జిల్లా కలెక్టర్ల మీటింగ్ ఒక్కసారికూడా పెట్టలేదని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. పాలనలో అదొక భాగమని, కానీ దాన్ని సరిగా చేయలేదన్నారు సీఎం చంద్రబాబు. ఇకపై ప్రతి 3 నెలలకోసారి కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.