Andhra Pradesh
ఏదో లాభం కోసమే వివేకాను హత్య చేసిన విషయాన్ని సీబీఐ కన్ఫర్మ్ చేస్తోంది. కాకపోతే ఆ లాభం ఏమిటి? వివేకా హత్యతో లాభపడేదెవరు అనే విషయాన్నే దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది. ఇక్కడే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమ వైఖరిని తెలియజేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, తెలంగాణలో కొనసాగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించద్దని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాశారు. కార్పొరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన ప్రధాని మోడీ.. స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో మాత్రం ఎందుకు సానుభూతి చూపటంలేదని నిలదీశారు.
సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తొందరలోనే బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ బీజేపీలో చేరటంలో ఆశ్చర్యమేమీలేదు. కాకపోతే తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించబోతున్నారన్న ప్రచారమే చాలా ఆశ్చర్యంగా ఉంది.
పార్టీ వర్గాలు చెప్పిన ప్రకారం వారాహి ఎప్పుడో రోడ్డెక్కాల్సింది. కానీ ఇంతవరకు దాని గురించిన సమాచారమే ఎవరికీ లేదు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సినిమా షూటింగులే. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయట.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు వచ్చిన ఢోకా ఏమీలేదు. అక్కడక్కడ జరుగుతున్న గొడవలు ఎప్పుడూ జరిగేవే. గత ప్రభుత్వాల హయాంలో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతునే ఉండేవి. ఇలాంటి చెదురుమదురు ఘటనలను చూపించి రాష్ట్రపతి పాలన విధించే అవకాశంలేదు.
తాజా బడ్జెట్ చూస్తే ఇటు తెలంగాణకు కానీ అటు ఏపీకి కానీ పెద్దగా ఒరిగిందేమీలేదు. పలానా ప్రాజెక్టుకు ఇన్ని నిధులు కేటాయిస్తున్నామని చెప్పుకునేందుకు బడ్జెట్‌లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకకు మాత్రం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది కేంద్రం.
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి తర్వాత వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయిన వారందరూ వచ్చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేయాల్సిందిగా తెలంగాణా కమ్మసంఘంలోని కీలక వ్యక్తులు బాగా ఒత్తిడి తెస్తున్నారు.
రానున్న రోజుల్లో బుల్లి డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయంలో వినియోగించేలా కృషి చేస్తోంది. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకు తగ్గించే ప్రయత్నం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏ పార్టీ ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది? దాని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే విశ్లేషణలతో జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.